ఇక్కడ ‘తిట్టేవాళ్లు’ అద్దెకు లభించును

పొద్దున లేస్తే చాలు రోజూ మొదలయ్యేది తిట్లతోనే పక్కింటి నుంచో.. ఇంటి పక్కనున్న రోడ్డుపైనో.. తిట్ల పూరణం వినిపిస్తుంది. వాదన సంఘజీవి జీవితంలో నిత్య అనుభవంగా అయిపోయింది. మనకు తెలియకుండానే మనం కూడా అప్పడప్పుడు నోటికి పని చెప్తుతుంటాం. మనల్ని తక్కువ చేయడానికో.. తప్పు అని నిరూపించడానికో కొందరు ప్రయత్నిస్తుంటారు. ఈ సమయంలో మన వాదనను బలంగా వినిపించలేదని చాలా మందికి అనిపిస్తుంది. మన తరుపున ఎవరైనా వాదించేవారు ఉంటే బాగుండనిపిస్తుంది. వాళ్లలా ఎదురు సమాధానం ఇచ్చేలా లేదా మన తరుపున ‘తిట్టేవాళ్లు’ ఎవరైనా ఉంటే బాగుండు అని కూడా అనిపిస్తుంటుంది. కానీ ఏం చేస్తాము అన్ని సందర్భాలలో మన తరుపున మాట్లాడేవారు ఉండారు కాబట్టి ఎదుటివారి నోటి దురుసుకు మనం బలి అవాల్సి ఉంటుంది.

అయితే ఇప్పుడు అన్నింటికి అవుట్ సోర్సింగ్ అనే అవకాశం ఉంది కాబట్టి.. తిట్టేవాళ్లను అద్దెకు తీసుకునే అవకాశం కలిపిస్తుంది ఓ చైనీస్ కంపెనీ. మనిషి ప్రతిస్పందనలను కూడా క్యాష్ చేసుకుంటున్నాయి కొన్ని సంస్థలు. చైనాకు చెందిన ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ తోబో ‘తిట్టేవాళ్లను అద్దెకివ్వడం’ వంటి  సేవలను ప్రారంభించింది. మీ తరుపున వాదించాలన్నా లేకపోతే తిట్టాలన్నా కూడా ఈ సంస్థ సేవలు అందిస్తుంది. వీళ్ళు సేవలు ప్రత్యేక్షంగా కాకుంగా పరోక్షంగా  అందుబాటులో ఉంటాయి. వీరు డైరెక్టుగా కాకుండా.. ఫోన్లో తిడతారు. అది వీలు కాకపోతే మెసేజ్‌ రూపంలో వీరి సర్వీస్ ఉంటుంది. తిట్టే సమయాన్ని బట్టి ఫీజులు వసూలు చేస్తారు. కనీసంగా 5 యెన్‌ల (చైనా కరెన్సీ) నుంచి 200 యెన్‌ల వరకు వసూలు చేస్తారు. మన కరెన్సీలో అయితే రూ.51 నుంచి రూ.2051 వరకు ఛార్జి వసూలు ఉంటుందన్న మాట. సేవలు పొందిన తర్వాత పేమెంట్ యాప్స్ .. విఛాట్ లేదా క్యూక్యూ ద్వారా డబ్బులు చెల్లించాలి. ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ చైనాలో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Recommended For You