సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అరుణాచల్‌ప్రదేశ్ చిన్నోడు

జనగణమన అధినాయక జయహే…. ఈ గీతాన్ని ఎవరు పాడినా.. ఎప్పుడు పాడినా భారతీయుల గుండెలు ఉప్పొంగుతాయి. దేశభక్తి పెల్లుబికుతుంది. ముద్దొచ్చే ఓ చిన్నారి మన జాతీయగీతాన్ని పాడితే ఇంకా సూపర్బ్‌గా ఉంటుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఓ చిన్నోడ జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

జాతీయ గీతాన్ని మనస్సుపెట్టి హృదయం ఉప్పొంగేలా చిన్నారి ఆలపిస్తున్న ఈ వీడియోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. నోరు సరిగ్గా తిరగకపోయినా, జాతీయ గీతంలోని కొన్ని చరణాలను కలిపేస్తూ, చివర్లో కొన్ని చరణాలను మరిచిపోయి, పాడ డంలో లీనమై దేశభక్తి చాటేలా పాడిన తీరు నెటిజన్లను ముగ్ధులను చేస్తోంది. చిరుప్రాయంలోనే జాతీ యగీతాన్ని గుర్తుంచుకొని పాడిన బుజ్జాయిని అభినందిస్తూ ఆ వీడియోను షేర్‌ చేస్తున్నారు.

Recommended For You