ప్రముఖ నిర్మాత కన్నుమూత

ప్రముఖ నిర్మాత వెంకట్రామిరెడ్డి కన్నుమూశారు. ఈ ఉదయం చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న వెంకట్రామిరెడ్డి  ఉదయం అస్వస్థతకు గురై అనంతరం తిరిగిరాని లోకాలు వెళ్ళిపోయారు. విజయా సంస్థల అధినేత నాగిరెడ్డి కుమారుడైన వెంకట్రామిరెడ్డి ఆ బ్యానర్‌పై పలు చిత్రాలను నిర్మాతగా వ్యవహరించారు. తమిళ సూపర్ స్టార్స్ అజిత్‌, విజయ్‌, విశాల్‌, ధనుష్‌లతో పలు చిత్రాలు తీశారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.తండ్రి బి.నాగిరెడ్డి పేరిట ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటులకు ప్రతియేటా పురస్కారాలను అందిస్తూ వచ్చారు. ఆయన మృతి పట్ల పలు సీని,రాజకీయ రంగ ప్రముఖులు సంతాపాన్ని తెలుపుతున్నారు.

Film Producer Venkatarami Reddy Passed Away - Sakshi

Recommended For You