అమెరికా సైన్యంపై ఇరాన్ ఆందోళన..

పశ్చిమాసియా సముద్రజలాల్లో అమెరికా సైన్యాన్ని మోహరించడంపై ఇరాన్ ఆందోళన వ్యక్తంచేసింది. ఇది ముమ్మాటికి ఉద్రిక్త పరిస్థితులను కల్గించడమేనని ఇరాక్ కమాండర్ ఒకరు తెలిపారు. యూఎస్ ఎస్ ఎర్లింగ్టన్, యూఎస్ ఎస్ అబ్రహం లింకన్ వంటి విమాన వాహక నౌకలతోపాటు, 40 నుంచి 50 యుద్దవిమానాలను, 6వేలమంది సైన్యాన్ని మోహరించిందని ఆయన ఆరోపించారు. అయితే తమ నైజం యుద్దం కాదని, ఇరాక్, అఫ్ఘనిస్థాన్, యెమెన్ లతోపాటు మధ్య ప్రాశ్చ దేశాల్లో శాంతిని నెలకొల్పడేమ తమ ఉద్దేశమని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మిక్ పాంపియో పునరుద్గాటించారు. మొత్తం మీద ఇరు దేశాల సైన్యం మోహరింపుతో పశ్చిమాసియా సమద్రజలాల్లో యుద్దవాతావరణం నెలకొంది.

Recommended For You