ధోనీ క్లారిటీ ఇచ్చేశాడు!

మహేంద్రసింగ్ ధోని. ఈ పేరు వింటే భారత క్రికెట్ అభిమానులకు అదొక దైర్యం. టెస్టులు, వన్డే ఇంటర్నేషనల్ లో ఒక భారతీయ కెప్టెన్ అత్యధిక విజయాలతో కెప్టెన్సీ రికార్డులను తిరగరాశాడు. అంతేకాదు పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప ఫినిషెర్ లో ఒక్కడు. ధోని టీమిండియా కెప్టెన్సీ చేపట్టాక భారత సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. అందులో రెండు వరల్డ్ కప్ లు కూడా. మిస్టర్ కూల్ గా అభిమానుల తనదైన శైలి ముద్ర వేసుకున్నధోనీ వచ్చే వరల్డ్ కప్ తరువాత రిటైర్ అవుతాడని చర్చ మొదలైన క్రమంలో ఆదివారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ధోనికి చివరి ఐపీఎల్ అవుతుందని అందరూ భావించారు.

సోషల్ మీడియాలో సైతం ఈ విషయం గురించి చర్చ బాగానే జరిగింది. ధోనీ చివరి మ్యాచు గెలవలేక వెనుతిరిగారు అనే అర్థం వచ్చేలా ఫొటోలతో పోస్ట్ లు పెడుతున్నారు. అయితే తన రిటైర్మెంట్ పై ధోని క్లారిటీ ఇచ్చేశాడు. ‘దేశం కోసం 2019 ప్రపంచకప్‌ గెలవడానికి కృషి చేయడమే నా బాధ్యత. చెన్నై జట్టు తరఫున ఈ సీజన్‌లోనూ మంచి క్రికెట్‌ ఆడాం. జట్టులో కొన్ని లోపాలున్నాయి. వాటిని సరిచేసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అన్నీ సహకరిస్తే మళ్లీ వచ్చే ఐపీఎల్‌ ఆడతానని అనుకుంటున్నాను’ అని ధోనీ పేర్కొన్నాడు.

Recommended For You