ఐపీఎల్‌-12 విజేత ముంబై ఇండియన్స్

ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్‌ 12వ సీజన్‌ ఫైనల్‌ పోరు ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. కేవలం ఒక్క పరుగు తేడాతో చెన్నై జట్టుపై గెలిచింది. ముంబై నాలుగోసారి టైటిల్‌ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో బరిలోకి దిగిన చెన్నై జట్టు 20ఓవర్లకు 148పరుగులు చేసింది. షేన్ వాట్సన్ పడిన కృషి వృధా అయింది.

చివరి బంతి వరకు ఉత్కంఠే…. కోట్లాది మంది ప్రేక్షకులు ఊపిరిబిగపట్టి చూశారు. ఐపీఎల్‌ విజేత ఎవరని… ? చివరి ఓవర్‌, చివరి బంతికి మలింగ మ్యాజిక్ చేయడంతో కేవలం ఒక్క పరుగుతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకుంది.

Recommended For You