‘మహర్షి’ మూవీ కలెక్షన్లు ఎంతో తెలుసా..?

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 25వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ తెలుగు రాష్ట్రాల్లో స్టడీగా కలెక్షన్లు రాబడుతోంది. మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో మహేశ్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీసు వద్ద 100 కోట్ల గ్రాస్ మార్కును విజయవంతంగా అధిగమించిందని ట్రేడ్ వర్గాల సమాచారం. లాంగ్ వీకెండ్‌లో మొత్తం నాలుగు రోజులకు కలిపి రూ.47.89కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.8,08కోట్లు రాబట్టింది. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.24.17కోట్లు షేర్ వసూలు చేసిన ఈ సినిమా మిగతా మూడు రోజులు కలిపి రూ.35 కోట్ల వసూలు చేసినట్టు తెలుస్తోంది. మహర్షి త్వరలోనే ‘భరత అనే నేను’ రికార్డును అధిగమించి, మహేష్ బాబు కెరీర్లో ఉత్తమంగా నిలుస్తుందని టాక్ వినబడుతోంది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో చాలా బాగున్నాయి. కర్నాటక, USA మరియు తమిళనాడులలో కూడా మంచి స్పందన లభిస్తోంది. మహర్షి భారీ వసూళ్లు సాధించడంపట్ల హీరోయిన్ పూజా హెగ్డే ట్విట్టర్ లో తన ఆనందాన్ని పంచుకుంది.

Recommended For You