విమానం ల్యాండ్ అవుతుండగా సాంకేతికలోపం.. 89మంది..

విమాన ప్రయాణమంటే కొంత రిస్క్ తో కూడుకొన్నదే. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలు గాల్లో కలుస్తాయి. అందుకే ఫైలెట్లు విమానాలను అత్యంత అప్రమత్తతో ఆపరేట్ చేస్తుంటారు. మయన్మార్ లో ఓ విమానానికి సాంకేతిక లోపం ఏర్పడగా…. పైలట్ సయమనంతో వ్యవహరించడంతో దాదాపు వందమంది ప్రాణాలతో బయటపడ్డారు.

మాండలే అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న ఓ విమానంలో సాంకేతిక లోపం తలెత్తి ముందుభాగంలోని టైర్ తెరుచుకోలేదు. దీంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని రన్ వేపై దింపాడు. వెనుకటైర్ల సహాయంతో విమానం ముందుభాగం రన్ వేను తాకిస్తూ ల్యాండ్ చేశాడు. దీంతో అందులో ఉన్న 89మంది ప్రయాణీకులు, ఏడుగురు సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. విమానం ల్యాండ్ కాగానే ప్రయాణీకులు బతుకుజీవుడా అంటూ కిందకు దిగి పరుగులు తీశారు. పైలెట్ సమయస్పూర్తిని కొనియాడారు.

Recommended For You