పదోతరగతి ఫలితాలు విడుదల.. పాస్‌ పర్సంటేజ్‌ ఎంతంటే..

తెలంగాణలో పదోతరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. సచివాలయంలో తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్‌రెడ్డి ఫలితాలు విడుదల చేశారు. పదో తరగతిలో 92.43 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పది ఫలితాల్లో మరోసారి బాలికలు పైచేయి సాధించారు. గతేడాది కంటే ఈ సారి 8 శాతంపైగా పాస్‌ పర్సంటేజ్‌ పెరిగింది.

99.8 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా టాప్‌లో నిలవగా.. 83.9 శాతం ఉత్తీర్ణతతో హైదరాబాద్‌ చివరిస్థానంలో నిలిచింది. ఇక 1580 జెడ్పీ స్కూల్లో 100కు 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 98.58 శాతం ఉత్తీర్ణతతో బీసీ వెల్ఫేర్ పాఠశాలలు టాప్‌లో నిలిచాయి.

జూన్ 10 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఇందు కోసం ఈ నెల 29 వరకు పరీక్ష ఫీజు చెల్లింపుకు గడువు విధించారు. ఇంటర్‌ ఫలితాల వివాదం నేపథ్యంలో టెన్త్‌ ఫలితాలకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.

Recommended For You