ప్యాంటు తడిచేలా రక్తం కారుతున్నా…

ఓవైపు వచ్చిన బ్యాట్స్‌‌మెన్ వచ్చినట్టు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. తనకు మాత్రం జట్టును గెలిపించాలనే సంకల్పం. దాటిగా ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అయిన గాయం వేధిస్తుంది. అప్పుడు కూడా ఓపెనర్ షేన్ వాట్సన్ ఒంటరి పోరాటం చేసి జట్టును విజయపు అంచులదాకా తీసుకెళ్లాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2019 ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఒక పరుగుతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చెన్నై బాట్స్ మెన్ షేన్ వాట్సన్ ఒంటరి పోరాటం చేసి 59 బంతుల్లో 80 పరుగులు చేశాడు. తర్వాత రనౌట్‌గా వెనుదిరిగాడు. అందరూ చెన్నై గెలుపు ఖాయమని అనుకుంటున్న తరుణంలో వాట్స్‌న్ ఔట్ అవ్వడం ముంబైకి కలిసివచ్చింది. అయితే వాట్సన్‌ అసాధరణ పోరాటంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాలికి తీవ్ర గాయం అయినా అదేం పట్టించుకోకుండా రక్తం కారుతున్నా.. కూడా పరుగులు తీయడం నిజంగా గ్రేట్ అంటున్నారు. అతని ప్యాంట్‌ తడిచి రక్తం బయటకు వస్తున్న పట్టించుకోకపోవడం అతని క్రికెట్ మీద ఉన్న ప్రేమ ఏంటో అర్ధమవుతుందన్నారు. చెన్నై జట్టు సభ్యుడు హర్భజన్ సింగ్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీన్ని చూసిన అభిమానులు ‘వాట్సన్ గ్రేట్’ అని కితాబిస్తున్నారు.

Recommended For You