తల,మొండెం వేరు చేసి.. మహిళను దారుణంగా హత్య చేసి..

కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ వివాహితను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చి శరీరభాగాలు వేరు చేశారు. ఈ ఘటన నందిగూడలో ఆదివారం జరిగినట్టు తెలుస్తోంది. నందిగూడకు చెందన శ్రీమతి శెట్టి(38)కి అహెడ్ ప్రాంతానికి చెందిన సుదీప్‌తో వివాహం జరిగింది. అయితే మనస్పర్థల కారణంగా శెట్టి, సుదీప్ లు విడాకులు తీసుకున్నారు. దీంతో ఆమె కొంతకాలంగా ఒంటరిగా ఉంటోంది. ఇటీవల మొబైల్ చోరీ కేసులో సుదీప్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హత్య చేశారు.

అనంతరం ముక్కలుగా నరికి తల, మొండెం వేరు చేశారు. శరీర భాగాలను రెండు సంచులలో ప్యాక్‌ చేసి మొండాన్ని నందిగూడలో, తలను నంటూర్‌ హైవే సమీపంలో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె అత్యాచారానికి గురై చంపబడిందా లేక మరే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఆమె ఉంటున్న ఇంటి ఓనరు, చుట్టుపక్కల ప్రాంతాల వారిని విచారించారు పోలీసులు.

Recommended For You