కఠిన నిర్ణయం : ఇకపై అబార్షన్ లు చేయిస్తే..

అమెరికాలోని అలబామా రాష్ట్రం అబార్షన్ ను నిషేధించింది. వివాదాస్పదమైన ఈ బిల్లును చర్చల అనంతరం ఆమోదించింది. తల్లిఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడితే తప్ప అన్నిరకాల అబార్షన్లను నిషేధించింది. అబార్షన్లు చేయడం ఇకనుంచి చట్టవిరుద్దమని ప్రకటించింది. ఈ నిబంధనలను అతిక్రమించిన వారికి 99 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 1973లో అమెరికన్ సుప్రీంకోర్టు అబార్షన్లను దేశవ్యాప్తంగా చట్టబద్దం చేసింది. అయితే కోర్టు తీర్పును సమీక్షించిన సెనెట్ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో విచ్చల విడిగా జరుగుతున్న అబార్షన్లపై దేశవ్యాప్తంగా మహిళలు, స్వచ్చంద సంస్థలు నిరసనలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో ఈనిర్ణయంతీసుకుంది.

Recommended For You