వచ్చే ఏడాది నుంచి పదోతరగతి పరీక్షల విధానంలో మార్పులు – సంధ్యారాణి

ap-tenth-class-exam-schedule-released-ganta-srinivasa-rao

వచ్చే ఏడాది నుంచి పదోతరగతి పరీక్షల విధానం, బోధనలో కూడా మార్పులు తీసుకరానున్నట్టు ఏపీ సర్కారు తెలిపింది. ఇంటర్నల్ మార్కుల విధానం ఉండదని స్పష్టం చేసింది. ప్రశ్నాపత్రం కూడా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. దీనిపై ఇప్పటికే నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌‌లో పదోతరగతి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి విడుదల చేశారు. మొత్తం 94.88 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వీరిలో బాలుర ఉత్తీర్ణత శాతం 94.68. బాలికలు 95.09 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా 98.19 శాతంతో ప్రథమస్థానంలో నిలవగా.. నెల్లూరు జిల్లాకు 83.19 శాతంతో చివరి స్థానం దక్కింది. ప్రకాశం, చిత్తూరు జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఏపీలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 3 వరకు 2,839 కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలకు నిర్వహించారు. పరీక్షలకు రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు మొత్తం కలిపి 6,30,082 మంది విద్యార్థులు హాజరుకాగా.. వీరిలో 6,19,494 మంది విద్యార్థులు పాసయ్యారు. మొత్తం 5,464 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదుకాగా..3 స్కూళ్లలో ‘సున్నా’శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో రెండు ప్రైవేటు పాఠశాలలు, ఒక ఎయిడెడ్‌ స్కూల్‌ ఉన్నాయి.

మొత్తం 33,972 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. అయితే వీరిలో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులే అధికంగా ఉన్నారు. ఇక రెండో స్థానంలో జిల్లాపరిషత్ పాఠశాలలు నిలిచాయి. తూర్పుగోదావరి జిల్లాలో అధికంగా 5,456 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం మే 30 లోపు దరఖాస్తు కోవాలి. రీవెరిఫికేషన్, జవాబు పత్రం జిరాక్స్ కాపీలు పొందడానికి ఒక్కో సబ్జెక్టుకు 1000 రూయలు చెల్లించాలి. అలాగే రీకౌంటింగ్ కోసం 500 చెల్లించాలి. జూన్ 17 నుంచి 29 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి మూడు సబ్జెక్ట్‌ల లోపు ఉన్నవారు రూ.110, మూడు సబ్జెక్ట్‌ల పైనా రాసేవారు రూ.125 ఫీజుగా చెల్లించాలి.

Recommended For You