ఆర్టికల్ 324ను తొలిసారిగా ప్రయోగించిన ఈసీ.. రేపు సాయంత్రం వరకే..

బెంగాల్‌లో హింస నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అసాధారణ నిర్ణయం తీసుకుంది. బెంగాల్‌లో ఎన్నికల ప్రచార గడువును 24 గంటలు తగ్గించింది. ఈ మేరకు ఆర్టికల్ 324ను తొలిసారిగా ఈసీ ప్రయోగించింది. రేపు రాత్రి 10 గంటల వరకే ప్రచారం చేయాలని ఆదేశించింది. అలాగే, బెంగాల్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆ పదవి నుంచి తొలగించింది. ఈ మేరకు ఆర్టికల్ 324ను తొలిసారిగా ఈసీ ప్రయోగించింది.

బెంగాల్‌లో ఇటీవల హింసాత్మక ఘటనలు జరిగాయి. ఇప్పటి వరకు జరిగిన ఆరు దశల పోలింగ్‌లలో రాష్ట్రవ్యాప్తంగా ఘర్షణలు చెలరేగాయి. తాజాగా కోల్‌కతాలో అమిత్ షా ర్యాలీ సందర్భంగా విధ్వంసం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్ని కల సంఘం కఠిన చర్యలు తీసుకుంది. ఆర్టికల్ 324ను ప్రయోగించిన ఈసీ, బెంగాల్‌లో ఎన్నికల ప్రచారాన్ని కుదించింది. వాస్తవానికి ఈనెల 17 సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియాల్సి ఉండగా, ఈసీ ఆదేశాలతో 19 గంటల ముందే ప్రచారానికి తెర పడనుంది.

Recommended For You