నేనున్నాను.. నీకేం కాదు.. వీడియో

జాగ్రత్త నాన్నా.. వర్షంలో తడవకు.. జలుబు చేస్తుంది. రెయిన్ కోటు క్లాస్‌లోకి వెళ్లిన తరువాతే తీసెయ్. అమ్మ ఎన్ని జాగ్రత్తలు చెబుతుంది తన చిన్నారి స్కూల్‌కి వెళుతుంటే. వెన్నలాంటి కమ్మనైన అమ్మ మనసు మనుషులకే కాదు గొరిల్లాలకూ ఉంటుంది. వర్షపు చినుకులు పడుతుంటే చిన్నారి గొరిల్లా ఎక్కడ తడిచిపోతుందో అని పొట్టకి అతికించుకుని జాగ్రత్తగా వర్షం పడని వైపుకి పరిగెడుతోంది. సౌత్ కరోలినాలోని రివర్ బ్యాంక్ జూకి సందర్శకులు వస్తున్నారు.

జూలో వున్న జంతువులను చూసి ఆనందంతో గెంతులు వేస్తున్నారు చిన్నారులు. ఇంతలో అక్కడ వర్షం మొదలైంది. గొరిల్లా పిల్లలు వర్షంలో తడవకూడదని వాటిని ఒడుపుగా పట్టుకుని చినుకులు ఎప్పటికి తగ్గుతాయో అనుకుంటూ.. సరేలే వర్షం పడని ప్లేసేదైనా ఉందేమో వెదుకుదాము అని చిన్న చినుకైనా పిల్లల మీద పడకుండా వెళుతున్నాయి. అమ్మ ప్రేమ అందరికీ ఒకటే అని రుజువు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు మనసున్న గొరిల్లాలు మా మనసులు దోచాయని అంటున్నారు.

Recommended For You