కోమటిరెడ్డి వెంకటరెడ్డి లక్ష ఓట్లతో ఓడిపోతారు – గుత్తా

కుటుంబపాలనపై కోమటిరెడ్డి సోదరులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఉదయం కేసీఆర్‌ని తిడుతూనే.. సాయంత్రం పార్టీలో చేర్చుకోమంటూ రాయబారాలు పంపే నైజం వారిదని ఆరోపించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ల రాజకీయ జీవితం చరమాంకంలో ఉందని విమర్శించారు. భువనగిరి ఎంపీ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లక్ష ఓట్లతో ఓడిపోతారంటూ జోస్యం చెప్పారు. తాజాగా ముగిసిన ప్రాదేశిక ఎన్నికల్లో ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని అన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి.

Recommended For You