సూర్యతాపంతో అల్లాడిపోతున్న ప్రజలకు మరో చేదువార్త

సూర్యతాపంతో అల్లాడిపోతున్న ప్రజలకు మరో చేదువార్త. మండే ఎండల నుంచి ఉపశమనం కోరుకుంటున్నవారిని, మరింత ఇబ్బందిపెట్టే సమాచారమిది. నైరుతి రుతుపవనాలు ఈసారి మరింత ఆలస్యం కానున్నాయి. ఎప్పుడూ వచ్చే తేదీ కంటే 3 రోజులు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. జూన్ 4వ తేదీన నైరుతి రుతు పవనాలు మలబారు తీరాన్ని తాకుతాయని ప్రముఖ వాతావరణ సంస్థ స్కైమేట్ తెలిపింది.

వాస్తవానికి ఏటా జూన్ ఒకటో తేదీన నైరుతి రుతుపవాలను కేరళ తీరాన్ని తాకుతాయి. ఆ తర్వాత జులై నాటికి దేశం అంతటికి విస్తరిస్తాయి. ఈసారి మాత్రం రుతుపవనాల ప్రవేశం 3 రోజులు ఆలస్యమవుతుందని స్కైమేట్ పేర్కొంది. అలాగే, ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటె తక్కువ వర్షపాతం నమోదవుతుందని స్కైమేట్ తెలిపింది. దేశ దీర్ఘకాల సగటులో 93 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశముందని స్కైమేట్ అభిప్రాయపడింది.

Recommended For You