అతడి మీద నుంచి రైలు వెళ్లినా.. వీడియో వైరల్

భూమ్మీద నూకలుంటే ఎలా అయినా బతికేస్తారు.. నిజమేనేమో కాకపోతే ఏంటి. ఎంత మందితో ఫైట్ చేసినా చెదరని క్రాప్, నలగని షర్ట్.. సినిమాలో హీరోలనే అలా చూస్తాము. ఇప్పుడు ఇతగాడు కూడా హీరో అయిపోయాడు. అంతసేపు ట్రైన్ తన మీద నుంచి వెళ్లినా ఏమీ జరగనట్టు ఎంచక్కా లేచి కూర్చున్నాడు. ముంబైకి చెందిన ఓ వ్యక్తి ట్రెయిన్ ఎక్కబోయి కాలు జారి పట్టాలపై పడి పోయాడు. ఇక అదే ఆఖరి రోజు.. తన పనైపోయిందనుకున్నాడు. ఎందుకో ఒక్క సెకనులో అద్భుతమైన ఐడియా వచ్చింది. వెంటనే ఇంప్లిమెంట్ చేశాడు. ట్రైన్ పట్టాల మధ్యలో పడుకుండి పోయాడు. నిజానికి ఆ శబ్ధానికే గుండె ఆగి ఛస్తారు. అలాంటిది ట్రెయిన్ వెళ్లినంత సేపు అలానే ఉండి అది వెళ్లిపోగానే లేచాడు. గురువారం రాత్రి అంథేరి స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డవడంతో వైరల్ అయింది. చిన్న దెబ్బ కూడా తగలకుండా చిద్విలాసంగా నవ్వుతూ లేచిన ఆ వ్యక్తికి తోటి ప్రయాణీకులు చేయందించి పైకి లాగారు.

Recommended For You