ఎంతకు తెగించాడు.. ఏటీఎం సెంటర్‌లో.. వీడియో

ఓ అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే మరో ఆలోచన రాదా. తన చెల్లి, తల్లి, కూతురు కూడా ఆడవాళ్లే కదా. ఎందుకు ఒక్క క్షణం కూడా ఆలోచించలేనంత బలహీనంగా మగాడు మారిపోతాడు. ఆమె అంగట్లో ఆట వస్తువా. ఆదుకోవడం మాట అటుంచి అఘాయిత్యాలకు పాల్పడుతూ తమ వక్రబుద్ధిని చాటుకుంటున్నారు. గడప దాటితే రక్షణ లేదన్న విషయాన్ని రుజువు చేస్తున్నారు. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో జరిగిన ఘోరం కలకలం రేపుతోంది. సందీప్ కుంభార్కర్ అనే వ్యక్తి అర్థరాత్రి ఆటోలో ప్రయాణిస్తున్నాడు.

మధ్యలో మరో అమ్మాయి అదే ఆటో ఎక్కింది. ఎక్కిన దగ్గర నుంచి ఎందుకో అతడి ప్రవర్తన తేడాగా అనిపించింది ఆమెకు. మరుక్షణం ఆటో దిగిపోయి పక్కనే ఉన్న ఏటీఎం సెంటర్‌‌లోకి వెళ్లింది డబ్బులు డ్రా చేయడానికని. ఆమె వెనుకే అతడు కూడా వెళ్లాడు. లోపల ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి సాయం చేస్తాననే నెపంతో ఆమెను అనుసరించి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె హెల్ప్ అని అరిచే సరికి గస్తీ తిరుగుతున్న పోలీసులు ఆమె అరుపులు విని అటువైపు వచ్చారు. ఇంతలో పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే అతడిని పట్టుకున్న పోలీసులు స్టేషన్‌కి తీసుకువెళ్లి దేహశుద్ధి చేసి సెల్లో పడేశారు.

Recommended For You