ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై హైకోర్టు విచారణ వాయిదా

ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈనెల 27న ఫలితాలు వెల్లడించాలని ఇంటర్‌బోర్డును ఆదేశించింది. రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్‌ పూర్తి చేశామని హైకోర్టుకు ఇంటర్‌ బోర్డు తెలిపింది. రేపు ఫలితాలు వెల్లడించాడనికి సిద్ధమని.. ఈనెల 27న సమాధాన పత్రాలు వెబ్‌సైట్‌లో పెడతామని వివరణ ఇచ్చింది.

దీంతో కోర్టు ఫలితాలను ,సమాధాన పత్రాలను ఒకే సారి విడుదల చేయాలని ఇంటర్‌ బోర్డును ఆదేశించింది. ఫలితాలు ప్రాసెస్ చేసిన గ్లోబరీనా సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపతి విచారణను జూన్ 6కి వాయిదా వేసింది హైకోర్టు.

Recommended For You