ఆడపిల్ల కోసం అనసూయ మళ్లీ..

ఇద్దరూ అబ్బాయిలైతే అమ్మాయి ఉంటే బావుండేదని లేదంటే ఇద్దరూ అమ్మాయిలుంటే అబ్బాయి ఉంటే బావుండేదని అనుకోవడం సహజం. ఇద్దరూ అబ్బాయిలే ఉన్న అనసూయక్కూడా అమ్మాయి అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే నాకు టైమ్ ఉంటే అమ్మాయిని కనడానికి రెడీ అయిపోతా. మూడోసారి కాకపోతే, నాలుగోసారి కూడా ట్రై చేస్తానంటోంది. ఇటీవల మాతృదినోత్సవం సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమ్మలోని కమ్మదనం గురించి వివరించింది. మీకెంత మంది పిల్లలు అని ఎవరైనా అడిగితే ఇద్దరూ అబ్బాయిలే అని చెప్పడం ఇబ్బందిగా ఉంది. అదే ఓ అమ్మాయి కూడా ఉంటే ఎంత బావుండు అని ఎప్పుడూ అనిపిస్తుంటుంది.

తన తల్లికి ముగ్గురు ఆడపిల్లలు కావడంతో తనకి అబ్బాయి పుట్టాలని కోరుకుందట. అయితే రెండోసారి కూడా అబ్బాయి పుట్టడంతో కొంత నిరాశకు గురయ్యానంటోంది. అందుకే అవకాశం వస్తే ఆడపిల్లను కనేస్తానంటోంది. నిజానికి అమ్మ కావడం అనేది దేవుడిచ్చిన ఓ అద్భుత వరం. అమ్మతనాన్ని ఆస్వాదించాలి. అమ్మమ్మకు ఎనిమిది మంది పిల్లలు. అంతమందితో ఇల్లంతా ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. పండగొస్తే ఇల్లంతా సందడి వాతావరణం. మామయ్యలు, పిన్నమ్మలు, పెద్దమ్మలు, వాళ్ల పిల్లలు.. వావ్ సందడి అంతా మా ఇంట్లోనే అంటూ మధుర జ్ఞాపకాల్ని మరోసారి గుర్తు చేసుకుంది. తనక్కూడా ఆడ పిల్లల్ని కనడమంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది అనసూయ.

Recommended For You