కర్రలు, కత్తులతో దాడి చేసుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన రెండు వర్గాలు కర్రలు, కత్తులతో దాడి చేసుకున్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని గోపారంలో ఈఘటన చోటు చేసుకుంది. బొంతు సతీష్‌-రాచమల్ల గోపిలకు మధ్య పాత కక్షలు ఉన్నాయి. ఈనేపథ్యంలో నిన్న పరిషత్ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్తున్న గోపిని సతీష్‌ కాలితో తన్నాడు. దీంతో గోపీ కూడా సతీష్‌పై ఎదురుదాడికి దిగారు. ఈ గొడవ చినికిచినికి కర్రలు, కత్తులతో దాడి చేసుకునే వరకు వచ్చింది. దీంతో కొనిజర్ల పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recommended For You