సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం.. కొట్టుకున్న టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ వర్గీయులు..

TRS congress flags

యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ -కాంగ్రెస్ వర్గీయులు బాహాబాహీకి దిగారు. బీబీనగర్‌లో ఇరుపార్టీల జెడ్పీటీసీ అభ్యర్థుల వర్గీయులు కొట్టుకున్నారు. ఈగొడవల్లో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం చేస్తున్నారంటూ ప్రశ్నించినందుకు తమ దాడికి దిగారు కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.. తమపై దాడి జరిగిందని ఫిర్యాదు చేయడానికి వస్తే తమను అకారణంగా అరెస్ట్ చేశారంటూ బీబీనగర్‌ పీఎస్‌ ముందు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్‌ జెడ్పీటీసీ అభ్యర్థి వనిత కుటుంబ సభ్యుల కారుపై టీఆర్‌ఎస్‌ నేత పింగళ్‌ రెడ్డి వర్గీయులు రాళ్లతో దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Recommended For You