వైట్ హౌజ్ లో ఇఫ్తార్ విందు..

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ లో ముస్లీంల పండుగ రంజాన్ సందర్బంగా ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు. దీనిలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌజ్ అధికారులకు, వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ విందు కార్యక్రమం సందర్బంగా శ్రీలంక, న్యూజిలాండ్, కాలిఫోర్నియా, పిట్స్ బర్గ్ ప్రాంతాల్లో జరిగిన ఉగ్రదాడులపై ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. పవిత్రమైన రంజాన్ మాసం కుటుంబాలను, ఇరుగుపొరుగువారిని మరింత చేరువచేస్తుందన్నారు. శాంతి, సహనంతో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలన్న ట్రంప్, అమెరికన్ ప్రజలు స్వేచ్చగా, పూర్తి భద్రతతో జీవిస్తున్నారని స్పష్టం చేశారు.

Recommended For You