నోట్లో పేలిన పైపు.. మహిళ మృతి

చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే చికిత్సకు ఉపయోంగించిన పైపే పేలింది. దీంతో మహిళ మృత్యువాత పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. అలీఘర్ కు చెందిన ఓ మహిళ కుటుంబకలహాల నేపథ్యంలో యాసిడ్ లాంటి పదార్థం తీసుకుంది. దీంతో అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను స్థానిక జేఎన్ అలీఘర్ మెడికల్ కాలేజీ అండ్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమించింది. ఆ మహిళ సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ తాగి ఉంటుందనే అనుమానంతో ఆమె పొట్టభాగంలోకి పైపులు పంపించి ఆ పదార్ధం తీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆ పైపు ఒక్కసారిగా పేలడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ కారణంగా నోట్లో పైపు వేయగానే అందులోని ఆక్సీజన్‌తో చర్య జరగడంతో పేలుడు సంభవించి ఉంటుందని వైద్యులు అభిప్రాయపడ్డారు.

Recommended For You