ఈసీ నిర్ణయం.. ఏపీ రాజకీయాల్లో చిచ్చు

first day nominations files in two telugu states

ఎన్నికలు ముగిసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈసీ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో చిచ్చు రాజేసింది. రాష్ట్రంలో ఇప్పటికే ఓసారి రీపోలింగ్ నిర్వహించగా..ఇప్పుడు రెండో విడత రీపోలింగ్ కు ఆదేశించింది ఈసీ. ఇప్పటికే ఈసీ తీరుపై భగ్గుమంటున్న టీడీపీకి ఈ లేటెస్ట్ నిర్ణయం మరింత ఆగ్రహం తెప్పించింది. ఏపీలో పోలింగ్ జరిగిన 35 రోజుల తర్వాత రీపోలింగ్ కు ఆదేశించటం వెనక ఆంత్యర్యం ఏమిటంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు..ఏప్రిల్ 11న పోలింగ్ ముగియగానే వైసీపీతో పాటు టీడీపీ కూడా ఫిర్యాదు చేసింది. ఈవీఎంల మొరాయింపు, గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో 30శాతం కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు చంద్రబాబు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 600కు పైగా పోలింగ్ కేంద్రాల్లో అడ్జర్న్‌ పోలింగ్ లేదా రీ పోలింగ్ నిర్వహించాలని కోరారు. అయితే వీటిని పరిగణలోకి తీసుకోని కేంద్ర ఎన్నికల సంఘం తొలి విడత మూడు జిల్లాల్లో ఐదు కేంద్రాల్లో రీ పోలింగ్‌కు ఆదేశించింది.

బూత్ కాప్చరింగ్ ఆరోపణల నేపథ్యంలో విచారణ నిర్వహించిన ఈసీ…చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ఫిర్యాదులతో ఇంత అసాధారణ నిర్ణయాలు తీసుకుంటున్న ఈసీ..తమ ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవటం లేదన్నది టీడీపీ వాదన. దీనిపై ఈసీని కలిసి ఫిర్యాదు చేసిన మంత్రి డొక్కా ఆనంద్ బాబు..ఆ

తమ డిమాండ్‌ మేరకు మూడో విడత కూడా రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. నరసరావుపేట, రాజాం పేట, జమ్మలమడుగు, సత్యవేడు, చంద్రగిరి, సత్తెనపల్లి వంటి చోట రీ పోల్ నిర్వహించాలని అంటున్నారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు నియోజక వర్గాల్లో 18 పోలింగ్ బూత్‌ల్లో రీ పోలింగ్ నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. పోలింగ్‌ ముగిసిన 25 రోజుల తర్వాత అంటే మే 6న చెవిరెడ్డి ఫిర్యాదు చేస్తే , మర్నాడు మే 7న చీఫ్‌ సెక్రటరీ ఓఎస్డీ రాసిన లేఖల ఆధారంగా సీఈఓ ….ఈసీకి సిఫార్సు చేయడాన్ని ప్రశ్నిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ నేత ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదికను ఎన్నికల సంఘం పట్టించుకోలేదని., కలెక్టర్‌ సిఫార్సు చేయకుండానే ఏక పక్షంగా రీ పోలింగ్‌కు ఎలా ఆదేశిస్తారని ప్రశ్నిస్తున్నారు.

ఈసీ రీ పోలింగ్ నిర్ణయం వెనుక కేంద్ర ప్రభుత్వం పనిచేసిందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన తర్వాత పలు మార్లు టీడీపీ ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోకపోవడం., వైసీపీ నేతల ఫిర్యాదుల మీద ఆఘమేఘాల మీద స్పందించడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని భావిస్తోంది. కీలకమైన సమయంలో సీఈఓ ద్వివేది సెలవులో వెళ్లడం కూడా కుట్రలో భాగమేనంటున్నారు. రీ వ్యవహారంలో పక్షపాత వైఖరిపై అవసరం అయితే న్యాయ పోరాటం చేయాలని టీడీపీ భావిస్తోంది.

Recommended For You