ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కన్నుమూత

ఆస్ట్రేలియా మాజీ ప్రధాని, మాజీ లేబర్ పార్టీ నేత బాబ్ హాక్ (89) మరణించారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హాక్ 1983 నుండి 1991 వరకు ప్రధానిగా పనిచేశారు. ఆయన హయాంలోనే ఆస్ట్రేలియా అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించడం ప్రారంభమైంది. ఆయన నాలుగు ఫెడరల్ ఎన్నికలలో గెలుపొందారు, లేబర్ పార్టీ నుంచి దీర్ఘకాలం పనిచేసిన ప్రధాన మంత్రిగా, రాబర్ట్ మెంజీస్ మరియు జాన్ హోవార్డ్ తరువాత ఆస్ట్రేలియా యొక్క మూడవ-అతిపెద్ద ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఆయనకు భార్య బ్లాంచే డి అల్పెగెట్, ముగ్గురు సంతానం ఉన్నారు.

Recommended For You