ఎన్నికల సంఘానికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు

చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మోదీ డైరెక్షన్‌లో ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ తన 4 పేజీల లేఖలో ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో అల్లర్ల వెనుక అమిత్‌ షా పాత్ర ఉన్నా చర్యలు తీసుకోలేదని మండిపడ్డాకు. 50 శాతం వీవీ ప్యాట్‌లు లెక్కించాలని 22 పార్టీలు చేసిన వినతిని ఈసీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేMejg. తాము చేసిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Recommended For You