గవర్నర్ నరసింహన్‌ను కలిసిన ఎంపీ కేవీపీ రామచంద్రారావు

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు ఏపీ రాజకీయాలపై గంట పాటు చర్చించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్వార్థ రాజకీయంతో పోలవరం నిధుల్లో రహస్య విధానాన్ని అనుసరిస్తున్నాయన్నారు. పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపడితే ప్రజలపై ఎలాంటి భారం ఉండదని అధికారులు చెబితే తాను బహిరంగ క్షమాపణ చేప్పేందుకు సిద్దమన్నారు.

Recommended For You