కొత్త జనరేషన్ కోసం కొత్త బైక్.. యాక్టివా 6జీలో ఎన్నో కొత్త ఫీచర్లు..

కొత్త జనరేషన్‌ని దృష్టిలో పెట్టుకుని వాహన తయారీ కంపెనీలు సరికొత్తగా మార్కెట్లోకి బైకులను తీసుకు వస్తుంటాయి. తాజాగా ప్రముఖ వాహన తయారీ కంపెనీ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ (హెచ్‌ఎంఎస్‌ఐ) మరో కొత్త స్కూటర్‌ను తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. దీని పేరు యాక్టివా 6జీ. కంపెనీ ఈ మోడల్‌ను 2020 ఫిబ్రవరి ఆటో ఎక్స్‌పో కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచనుంది.

హోండా యాక్టివా 6జీలో 110 సీసీ ఇంజన్ ఉంటుంది. బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్, కాల్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. అలాగే ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ ఫిల్టర్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇన్ని ఫీచర్‌లతో మార్కెట్లోకి రానున్న హోండా బైక్ ఇదే అంటున్నారు. ఇంకా 12 అంగుళాల అలాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయంటున్నారు. అలాగే దీనిలో ఆల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉండే అవకాశాలు ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి.

అలాగే రోడ్డు అస్తవ్యస్థంగా ఉన్నా ప్రయాణం సుఖవంతంగా జరగడానికి వీలుగా స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్ అమర్చవచ్చు. ఇక ధర విషయానికి వస్తే ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే కొత్త యాక్టివా 6జీ రూ.7,000 ఎక్కువే ఉంటుందని సమాచారం. ప్రసుత యాక్టివా 5జీ బేస్ మోడల్ ధర రూ.54,632గా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది.

Recommended For You