ఎవరో ఎందుకు కామెంట్ చేయడం.. నా మీద నేనే.. నాకు నేనే..

అందమైన హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్.. బుల్లితెర మీద సందడి చేస్తూ.. అప్పుడప్పుడు వెండి తెర మీద వెలుగులు పంచుతూ యువ హృదయాల్ని గిలిగింతలు పెడుతుంది. సమాజంలో జరిగే కొన్ని విషయాల పట్ల స్పందిస్తూ తన అభిప్రాయాలను ట్విట్టర్‌లో పోస్టు చేస్తుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తనపై అనవసర కామెంట్ చేసే వారిని స్మూత్‌గానే చురకలు అంటిస్తుంది. తాజాగా బుల్లితెర షో ‘ఢీ’ కోసం ఓ పింక్ డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది.

ఆ డ్రెస్ వేసుకుని తనని తాను అద్దంలో చూసుకుంది. వెంటనే తన మదిలో.. కడుపులో మంట తగ్గడం కోసం, గ్యాస్ ట్రబుల్‌తో బాధపడుతున్న వారు వేసుకునే జెలూసిల్ బాటిల్ గుర్తొచ్చిందట. అదే విషయాన్ని చెబుతూ ఈ డ్రెస్‌లో నేను అచ్చంగా జెలూసిల్ ‌బాటిల్‌లా ఉన్నాను కదూ అంటూ పోస్ట్ పెట్టింది. దాంతో పాటు తన ఫొటోని, పక్కనే జెలూసిల్ బాటిల్ ఫొటోని పెట్టి పోస్ట్ చేసింది. అందమైన పింక్ డ్రెస్‌లో రష్మీ మరింత అందంగా కనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

Recommended For You