అర్జంట్‌గా పాన్ కార్డ్ కావాలా.. ఇలా చేయండి.. 48 గంటల్లో..

ఒకప్పుడు పాన్ కార్డ్ కొద్ది మందికి మాత్రమే ఉండేది. ఇప్పడు పాన్ కార్డ్ కూడా అందరికీ అవసరమైపోయింది. బ్యాంక్ ట్రాన్సాక్షన్లు జరిపే ప్రతి ఒక్కరి దగ్గర పాన్ కార్డ్ తప్పనిసరై కూర్చుంది. ఇక పాన్ కార్డ్ ఉంటేనే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలనే రూల్ కూడా ఉండడంతో కార్డు తీసుకునే వారి సంఖ్య ఎక్కువవుతోంది. మరి పాన్ కార్డ్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే దాదాపు రెండు మూడు వారాలు పట్టేది. కానీ లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత పాన్ కార్డ్ పొందడం సులువై పోయింది. ఇప్పుడు మరింత ఈజీగా ఆన్‌‌లైన్‌ లోనే కొన్ని సులువైన పద్దతుల ద్వారా పాన్ కార్డ్ ఈజీగా పొందొచ్చు. అదే పోస్ట్‌లో అయితే 15 నుంచి 20 రోజులు పడుతుంది.

ఇందుకోసం ఫామ్ 49ఏ లేదా ఫామ్ 49ఏఏ దరఖాస్తు ద్వారా మీరు వెంటనే పాన్ కార్డ్ పొందొచ్చు. ఎన్‌ఎస్‌డీఎల్ అధికారిక వెబ్‌సైట్ www.tin-nsdl.com లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. లేదా పాన్ కేంద్రం నుంచి పాన్ దరఖాస్తు ఫామ్ తీసుకోవచ్చు. లేదంటే వెబ్‌సైట్ నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫామ్ మొత్తాన్ని బ్లాక్ ఇంక్‌తో ఇంగ్లీషులో క్యాపిటల్ లెటర్స్‌తో పూరించాలి. వైట్ బ్యాక్ గ్రౌండ్‌తో రెండు కలర్ ఫొటోలు అతికించాలి. డేట్ ఆఫ్ బర్త్, ఐడీ, అడ్రస్ ఫ్రూఫ్ జత చేయాలి. బర్త్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఎలక్ట్రిసిటీ బిల్, రేషన్ కార్డ్ వంటివి జత చేయాలి. మొబైల్ నెంబర్, ఇ-మెయిల్ ఐడీ వివరాలు రాయాలి. అప్లికేషన్ ఆన్‌లైన్ ద్వారా పంపిస్తున్నట్లయితే డిజిటల్ సిగ్నేచర్ తప్పనిసరి. ఇలా మొత్తం ఎక్కడా తప్పులు లేకుండా జాగ్రత్తగా దరఖాస్తు పూర్తి చేసి పంపిస్తే మీకు ఫిజికల్ కార్డ్ వచ్చే లోపు ఇ-పాన్ జారీ అవుతుంది. మీకు వచ్చిన అకనాలెడ్జ్‌మెంట్ నెంబర్ ద్వారా మీ పాన్ కార్డ్ దరఖాస్తును ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. రెండు రోజుల్లోనే మీకు ఇ-పాన్ జారీ అవుతుంది. అత్యవసరమైతే ఇ-పాన్ ఉపయోగించుకోవచ్చు. ఇక మీ ఫిజికల్ పాన్ కార్డ్ 15 నుంచి 20 రోజుల్లో పోస్టులో వచ్చేస్తుంది.

Recommended For You