తిరుమల నడక మార్గంలోని లోయలో పడిన భక్తుడు

తిరుమల నడక మార్గం లోయలో పడిన భక్తుడు సురక్షితంగా బయటపడ్డాడు. అలిపిరి మార్గంలోని అక్కగార్ల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లోయలో పడిన వ్యక్తి పెద్దగా అరుపులు వేయడంతో కాలిబాట భక్తులు విజిలెన్స్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భక్తుడిని లోయ నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. తమిళనాడుకు చెందిన భక్తుడిగా గుర్తించారు. లోయలోకి ఎలా వెళ్లాడో అనే కోణంలో విచారిస్తున్నారు తిరుమల పోలీసులు.

Recommended For You