ముఖేశ్ అంబానీ తనయుడి పెద్ద మనసు… రోడ్డుపై ఏం చేశాడో తెలుసా..?

భారతీయ అపరకుబేరుడు ముకేశ్ అంబానీకి కొడుకు ఆకాష్ అంబానీ తన మానవీయత చాటుకున్నారు. రోడ్దుపై రక్తమోడుతున్న ఓ వ్యక్తికి సాయం చేసి వార్తల్లో నిలిచారు. బుధవారం రాత్రి ఆకాష్ అంబానీ తన కాన్వాయ్ తో రోడ్డుపై వెళుతున్నాడు. ఇంతలో రోడ్డుపై రక్తమోడుతూ ఓ వ్యక్తి కనిపించాడు. అతన్ని చూసిన ఆకాష్ అంబులెన్స్ కు సమాచారం ఇవ్వమని అనుయాయులకు పురమాయించాడు. అయితే సకాలంలో రాకపోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో ఆలస్యం చేస్తే ప్రమాదం అని భావించి తన టయోటా ఫార్చ్యూనర్ కారులో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆకాష్ అంబానీ పెద్దమనసును పలువురు మెచ్చుకున్నారు.

Recommended For You