ఈసీ అధికారుల తీరుతో ప్రజాస్వామ్యం నిట్టినిలువునా కూలింది : నక్కా ఆనంద్ బాబు

చంద్రగిరి రీపోలింగ్‌ పై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ఈసీ నిర్ణయంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాము ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోని ఈసీ.. వైసీపీ ఫిర్యాదులపై వెంటనే స్పందించి నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. అమరావతిలో నక్కా ఆనంద్ బాబు ఆధ్వర్యంలో సీఈవోను కలిసి ఫిర్యాదు చేశారు. తాము 25 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కోరిన పట్టించుకోలేదని ఆరోపించారు. మరోవైపు ఈసీ అధికారుల తీరుతో ప్రజాస్వామ్యం నిట్టినిలువునా కూలిందని అన్నారు నక్కా ఆనంద్ బాబు.

Recommended For You