సామాన్యుడిపై పోలీస్‌ ప్రతాపం.. చెంప చెళ్లుమనిపించిన..

సామాన్యుడిపై తన ప్రతాపం చూపించాడు పోలీస్‌. వికారాబాద్‌ జిల్లా తాండూరు బస్టాండ్‌ సమీపంలో అంబేద్కర్‌ చౌక్‌ వద్ద ఈఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిపై కానిస్టేబుల్ శ్రీనివాస్‌ దాడి చేయడంతో పక్కనే ఉన్న మరో వ్యక్తి దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో నీకేందుకు అంటూ అతనిపై తన జులుం చూపించాడు కానిస్టేబుల్. ఓ వ్యక్తిపై దాడిని అడ్డుకున్న మరొకరి చెంప చెళ్లుమనిపించాడు కానిస్టేబుల్.  ఇష్టం వచ్చినట్లు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా కొట్టాడు. శ్రీనివాస్‌ తాండూరు పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. ఈయన తీరుపట్ల జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Recommended For You