ప్రకాశం జిల్లా మార్కాపురంలో దారుణం.. డబ్బులివ్వలేదని తల్లిదండ్రులపై..

ప్రకాశం జిల్లా మార్కాపురంలో దారుణం జరిగింది. పుట్టినరోజు వేడుకలకు డబ్బులివ్వలేదని తల్లిదండ్రులపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడో కర్కోటకుడు. స్థానికంగా కూలీ పనులకు వెళ్లే ప్రసాద్.. పుట్టిన రోజు సందర్భంగా పార్టీ చేసుకోవాలంటూ తల్లిదండ్రులను డబ్బులు అడిగాడు. వారు డబ్బులు లేవని చెప్పడంతో బయటకు వెళ్లి మద్యం సేవించి వచ్చాడు. కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంటానని బెదిరించాడు. ప్రసాద్‌ను వారించేందుకు దగ్గరకు వెళ్లిన తల్లిదండ్రులపై కిరోసిన్ పడింది. అదే సమయంలో అగ్గిపుల్ల వెలిగించడంతో వారు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను మార్కాపురం రిమ్స్‌కు తరలించారు.

Recommended For You