టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు.. సినీ తారలకు క్లీన్‌చిట్‌ ఇవ్వలేదు – ఎక్సైజ్‌ శాఖ

టాలీవుడ్‌ను కుదుపేసిన డ్రగ్స్‌ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందన్నారు ఎక్సైజ్‌ శాఖ అధికారులు. ఈ కేసులో నటీనటులతో సహా ఏ ఒక్కరికీ క్లీన్‌చీట్‌ ఇవ్వలేదన్నారు. సమాచార హక్కు చట్టం కింద ఫోరం ఫర్‌ గుడ్‌గవర్నెన్స్‌ కార్యదర్శి పద్మనాభరెడ్డి.. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు విచారణ వివరాలు కోరారు. దీనిపై స్పందించిన ఎక్సైజ్‌శాఖ ఈ సమాచారాన్ని తెలియజేసింది. ఈ కేసులో 62 మందిని విచారించినా.. ఎవరిపైనా చర్యలు తీసుకోలేదంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు ఎక్సైజ్‌ శాఖ ఉన్నాతాధికారులు. సినీహీరోలు, నటులకు క్లీన్ చీట్‌ ఇచ్చారన్న వార్తల్ని కొట్టిపారేశారు.

మొత్తం 12 కేసుల్లో ఇప్పటివరకు 7 ఛార్జ్‌షీట్లు దాఖలు చేశామన్నారు. ఐదు ఛార్జ్‌షీట్లు దాఖలు చేయాల్సి ఉందని వెల్లడించారు. ఇంకా అనేక ఆధారాలు రావాల్సి ఉందని స్పష్టం చేశారు. లభ్యమైన ఆధారాలను బట్టి ఎప్పటికప్పుడు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసి కోర్టుకు సమర్పిస్తునట్లు తెలిపారు ఎక్సైజ్‌ అధికారులు. అంతే తప్ప ఎవరికీ క్లీన్‌చిట్‌ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారెవరిని వదిలిబెట్టబోమన్నారు.

Recommended For You