మొన్న నిజామాబాద్‌.. నిన్న వరంగల్‌.. ఓటు వేస్తూ వీడియో.. వైరల్

పోలింగ్ జరుగుతుంటే.. కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఆంక్షలు అమల్లో ఉంటాయి. పోలింగ్‌ బూత్‌ల్లోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లకూడదు. కానీ.. నిజామాబాద్‌ జిల్లాలో ఓ యువకుడు ఓటు వేస్తూ వీడియో తీసుకున్నాడు. వేల్పూర్ మండలం పడిగల్‌కు చెందిన ఆ యువకుడి ఓటింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

ఓటు వేస్తూ వీడియో తీసుకున్న ఆకతాయి ఘటన వరంగల్‌ జిల్లాలోను వెలుగులోకి వచ్చింది. వీడియో తీసుకున్న యూత్‌.. దాన్ని ఫ్రెండ్స్‌కు షేర్ చేశారు. అలా సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌గా చక్కర్లు కొడుతోంది.

ఈ రెండు వీడియోలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. అసలు పోలింగ్ బూత్‌ల్లోకి సెల్‌ఫోన్లు ఎలా అనుమతించారు.. అక్కడ డ్యూటీలో ఉన్న సిబ్బంది ఎవరనే అంశాలపైనా దృష్టి పెట్టింది. అటు.. జిల్లా యంత్రాంగం కూడా విచారణ చేస్తున్నారు.

Recommended For You