విషాదం.. బీచ్‌లో యువతి సెల్ఫీ.. ఒక్కసారిగా వచ్చిన అలలు..

బీచ్‌లో ఓ యువతి సెల్ఫీ తీసుకుంటుండగా ఒక్కసారిగా వచ్చిన అలలు.. ఆమెను సముద్రంతోకి తీసుకెళ్లిపోయాయి. ఈ ఘటన గోవాలో చోటుచేసుకుంది.

కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన రమ్యకృష్ణ గోవా ప్రభుత్వ అనుబంధ వైద్యశాలలో పనిచేస్తున్నారు. గతేడాది వరకు జగ్గయ్యపేట స్థానిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణిగా పనిచేసిన ఆమె.. 2018లో గోవాలో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లారు. సాయంత్రం సమయంలో డాక్టర్ రమ్యకృష్ణ సరదాగా గడపటానికి గోవా బీచ్‌కు వెళ్లారు. అక్కడ సెల్ఫీ తీసుకుంటుండగా ఒక్కసారిగా వచ్చిన అలలు.. ఆమెను సముద్రంతోకి తీసుకెళ్లిపోయాయి. రమ్యకృష్ణ మృతితో జగ్గయ్యపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం సాయంత్రానికి రమ్యకృష్ణ మృతదేహాన్ని జగ్గయ్యపేట తీసుకురానున్నారు.

Recommended For You