యాదాద్రిలో మరో దారుణం.. మహిళ హత్య.. మృతదేహం పక్కనే మద్యం బాటిల్

యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. రాజపేట మండలం జాల గ్రామ శివారులో ఓ మహిళను హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. మహిళ మృతదేహం పక్కన మద్యం బాటిల్ పడి ఉంది. అత్యాచారానికి తెగబడి హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డాక్ స్క్వాడ్ తో ఆధారాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. యాదాద్రి జిల్లా హజీపూర్ లో ఇటీవలె వరుస హత్యల ఘటన కలకలం సృష్టించింది. సైకో కిల్లర్ ను అరెస్ట్ చేసిన రోజుల వ్యవధిలోనే జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది.

Recommended For You