క్రైమ్

కోర్కె తీరిస్తే మార్కులు వేస్తానంటూ అమ్మాయిలను..

కోర్కె తీరిస్తే మార్కులు వేస్తానంటూ అమ్మాయిలను..
X

పాఠాలు చెప్పే మాష్టారికి పాడు బుద్ధి పుట్టింది. చదివిన చదువు.. నేర్చుకున్న పాఠాలు ఏం నేర్పాయో.. పెళ్లై పిల్లలున్నా అమ్మాయిని చూస్తే చాలు మెలికలు తిరిగే అతని స్వభావం.. కుక్క తోక వంకరలా మాష్టారైనా బుద్ధి మారలేదు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరీదాబాద్‌లోని ప్రభుత్వ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన ఓ వ్యక్తి.. మీరు పరీక్షలు బాగా రాసినా రాయకపోయినా మార్కులు వేసేస్తా.. నా కోర్కె తీర్చేస్తే అంటూ అమ్మాయిలను ప్రలోభ పెట్టి లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. విద్యార్థినులు మార్కుల కోసం అతడికి లొంగిపోయేవారు.

దీంతో అతడి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అయితే ఇదే కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న వ్యక్తి కూడా ఓ విద్యార్థిని లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె మొదట్లోనే అతడి ఆగడాలకు అడ్డుకట్ట వేసింది. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. వారి దర్యాప్తులో ల్యాబ్ అసిస్టెంట్ లీలతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ రాసలీలలు కూడా బయటపడ్డాయి. పరిస్థితి తెలుసుకున్న ప్రొఫెసర్ పరారయ్యాడు. పోలీసులు ల్యాబ్ అసిస్టెంట్‌ని అరెస్ట్ చేసి, ప్రొఫెసర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story

RELATED STORIES