తాజా వార్తలు

బీజేపీకి షాక్ ల మీద షాక్‌లు ఇస్తున్నా..

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్... బీజేపీ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. బీహార్ లో తప్ప వేరే రాష్ట్రాల్లో ఎన్డీఏతో పొత్తు ఉండదని ప్రకటించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఒంటరి పోరేనని స్పష్టం చేశారు.

ఎన్డీఏలోప్రధాన పార్టీ అయిన జేడీయూకు బీజేపీతో సంబంధాలు మరింత క్షీణించే దశకు చేరుకున్నాయి. బీహార్ వెలుపల ఎన్డీయేతో పొత్తు ప్రసక్తే లేదని జేడీయూ తెలిపింది. త్వరలో ఎన్నికలు జరగనున్న జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, హర్యానా, ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ఆ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల వరకు ఎన్డీఏలో భాగస్వామ్యమైన జేడీయూకు, బీజేపీతో మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అప్రతిహత విజయం ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలను దెబ్బతీసింది. కేంద్ర మంత్రివర్గంలో తమకు రెండు బెర్త్ లు కావాలని జేడీయూ డిమాండ్ చేసింది. అయితే అన్ని మిత్రపక్షాలకు ఒకటే ఇస్తున్నామని, మీకు కూడా ఇలానే ఉంటుందని బీజేపీ అధిష్టానం స్పష్టం చేసింది. దీంతో ఆగ్రహం చెందిన బీహార్ సీఎం నితిష్ కుమార్ కేబినెట్ లో చేరబోమంటూ తొలి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా షాక్ లు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో బీజేపి నుంచి ఎవరికి అవకాశం ఇవ్వలేదు. ఇక ఇప్పుడు బీహార్ మినహా మరే రాష్ట్రంలోనూ ఎన్డీయేతో పొత్తు వద్దని మరో పెద్ద నిర్ణయం తీసుకున్నారు. .

నితీష్ కుమార్ షాకులపై బీజేపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మరి కమలనాథులు బీహార్ లోనే పొత్తుకు పరిమితమవుతారా..? లేదా జేడీయూతో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటారా..? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.

Next Story

RELATED STORIES