చిగురుపాటి జయరాం హత్యకేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

పారిశ్రామికవేత్త NRI చిగురుపాటి జయరాం హత్యకేసు చార్జిషీటులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. 23 పేజీల చార్జిషీటును పోలీసులు దాఖలు చేశారు. మొత్తం 12 మంది నిందితులను 73 సాక్ష్యుల పేర్లను చార్జిషీట్ లో చేర్చారు. ముగ్గురు పోలీసు అధికారులు కూడా నిందితులుగా ఉన్నారు. హనీ ట్రాప్ పన్ని, వీణ అనే యువతి పిలిచినట్టుగా నాటకమాడి, జయరాంను రప్పించారు. చిత్ర హింసలు పెట్టి హత్య చేసిన రాకేశ్ రెడ్డి, ఆ మృతదేహాన్ని తెలంగాణ సరిహద్దులు దాటించారని చార్జిషీట్ లో పేర్కొన్నారు.
రాకేశ్ రెడ్డి, విశాల్, వాచ్‌మెన్ శ్రీనివాస్, కమెడియన్ సూర్యప్రసాద్, అతని స్నేహితుడు కిషోర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి సుభాష్ రెడ్డి, టీడీపీ నాయకుడు బీఎన్ రెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి అంజిరెడ్డి, నల్లకుంట మాజీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు, రాయదుర్గం మాజీ ఇన్‌స్పెక్టర్ రాంబాబు, ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ మల్లారెడ్డి పేర్లను చార్జిషీటులో నిందితులుగా పేర్కొన్నారు. 73 మంది సాక్షుల్లో 11వ సాక్షిగా శిఖా చౌదరి, సాక్షిగా శిఖా బాయ్ ఫ్రెండ్ సంతోష్ రావులను చేర్చారు.
హనీ ట్రాప్ తో రాకేశ్ రెడ్డి జయరాం హత్యకు కుట్రపన్నాడు. పిడిగుద్దులు గుద్ది మొహంపై దిండుతో అదిమిపెట్టి ఊపిరి ఆడకుండా చేసి రాకేశ్ రెడ్డి హత్యచేశాడు. పోలీసుల సూచనతోనే జయరాం మృతదేహాన్ని రాకేశ్ రెడ్డి నందిగామ తరలించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని రాకేశ్ రెడ్డి వీడియో చిత్రీకరించాడు. 11 వీడియోలు, 13 ఫోటోలు తీశాడు.
టెట్రాన్ కంపెనీ వివాదం పరిష్కరిస్తానని జయరాంకు రాకేశ్ రెడ్డి పరిచయమయ్యాడు. అదే సమయంలో శిఖా చౌదరితోనూ రాకేశ్ రెడ్డికి పరిచయం ఉంది. వీరిద్దరూ సహజీవనం చేస్తూ విదేశాల్లో జల్సాలు చేశారు. రాకేశ్ రెడ్డి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పటికీ... శిఖా వాయిదా వేస్తూ వచ్చింది. రాకేశ్ తో సహజీవనం చేస్తూనే సాగర్ అనే వ్యక్తితో శిఖ యూరప్ వెళ్లింది. విషయం తెలుసుకున్న రాకేశ్ రెడ్డి శిఖాను నిలదీశాడు.
తనపై ఖర్చు చేసిన డబ్బు తిరిగి ఇవ్వాలని రాకేశ్ రెడ్డి శిఖను డిమాండ్ చేశాడు. శిఖా BMW కారును ఎత్తుకెళ్లేందుకు కూడా ప్రయత్నించాడు. గొడవ పెరుగుతుండటంతో... శిఖాపై చేసిన ఖర్చు మొత్తం చెల్లిస్తానని జయరాం హామీ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత జయరాం మాటతప్పాడు. ఫోన్ లకు కూడా జయరాం స్పందించలేదు. దీంతో అతడిని కిడ్నాప్ చేయాలని రాకేష్ రెడ్డి స్కెచ్ వేశాడు. జయరాం రాకపోకలపై సమాచారం ఇవ్వాలని శిఖా చౌదరి వాచ్‌మెన్ కు రాకేశ్ డబ్బులిచ్చాడు.
జనవరి 29న శిఖా చౌదరి ఇంటి వద్ద జయరాంను కిడ్నాప్ చేసేందుకు రాకేశ్ రెడ్డి ప్రయత్నించాడు. జయరాం తృటిలో తప్పించుకున్నాడు. ప్లాన్ ఫెయిల్ అయ్యాక రాయదుర్గం సీఐ రాంబాబును రాకేశ్ కలిసాడు. వీణ పేరుతో ఓ నంబర్ ద్వారా కలిసి లంచ్ చేద్దామని జయరాం కి మెసేజ్ పెట్టాడు. వీణ డ్రైవర్లమంటూ కమెడియన్ సూర్యప్రసాద్, కిషోర్లు జయరాంను రాకేశ్ ఇంటికి తీసుకెళ్లారు.
జయరాం సెల్ ఫోన్లను రాకేశ్ లాక్కున్నాడు. డబ్బులిస్తే వదిలిపెడతానన్నాడు. దస్ పల్లా హోటల్ లో రాకేశ్ అనుచరుడికి ఈశ్వరరావు అనే వ్యక్తి 6 లక్షలు ఇచ్చాడు. ఆన్ ద స్పాట్ 50 లక్షలు కావాలని డిమాండ్ చేసిన రాకేశ్ రెడ్డి.. ఛాతిలో నొప్పిగా ఉంది హాస్పిటల్ తీసుకెళ్లమని జయరాం, రాకేశ్ రెడ్డిని కోరాడు. నాలుగున్నర కోట్లు జయరాంకు అప్పు ఇచ్చినట్టు రాకేశ్ రెడ్డి రాయించుకున్నాడు. టీడీపీ నేత బీఎన్ రెడ్డి సమక్షంలో అగ్రిమెంట్ జరిగింది. సంతకాలు తీసుకున్నాక... జయరాంను హత్య చేయమని రాకేశ్ రెడ్డి, నగేష్ ను ఆదేశించాడు.
నగేష్ హత్యచేయనని చెప్పడంతో అతడి బంధువు విశాల్ సహకరించాడు. ఆ తర్వాత దారుణంగా చిత్రహింసలకు గురిచేసి జయరాంను హత్యచేశారు. హత్య విషయాన్ని రాయదుర్గం మాజీ సీఐ రాంబాబుకు రాకేశ్ రెడ్డి ఫోన్లో చెప్పాడు. ఆ తర్వాత కారులో మృతదేహంతో నల్లకుంట పోలీస్ స్టేషన్ కు రాకేశ్ వెళ్లాడు. మాజీ శ్రీనివాసులతో మాట్లాడి మృతదేహాన్ని ఏపీకి తరలించారు.
RELATED STORIES
Drone Pilot: 'టెన్త్' అర్హతతో 'డ్రోన్ పైలట్'.. మరో బెస్ట్ కెరీర్...
17 May 2022 5:30 AM GMTFCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు.. వాచ్ మెన్ నుండి...
16 May 2022 4:30 AM GMTBihar : బీహార్ సీఎంకి షాకిచ్చిన 11 ఏళ్ల బాలుడు...!
15 May 2022 3:15 PM GMTIOCL recruitment 2022 : ఇంజినీరింగ్ అర్హతతో ఐఓసీఎల్ లో ఉద్యోగాలు.....
14 May 2022 4:30 AM GMTSSC Phase X Recruitment 2022: టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర...
13 May 2022 4:45 AM GMTIndia Post Payments Bank(IPPB) GDS Recruitment 2022: డిగ్రీ అర్హతతో ...
12 May 2022 4:30 AM GMT