హీరో శివాజీని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

హీరో శివాజీని అదుపులోకి తీసుకున్న పోలీసులు!
X

అలంద మీడియా కేసులో సినిమా నటుడు శివాజీని.. సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.శంషాబాద్‌ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకొని.. సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విదేశాలకు వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు..అయితే ఆయన్ను అరెస్ట్ చేయడం లేదని.. కోర్టు ఆదేశాల మేరకు 41- CRPC కింద నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. విచారణకు సహకరించాల్సిందిగా శివాజీని కోరామని పోలీసులు తెలిపారు.

అలంద మీడియాకు సంబంధించిన షేర్ల కొనుగోలు వ్యవహారంలో శివాజీపై ఆరోపణలున్నాయి. ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాశ్‌ కొన్ని షేర్లను శివాజికి బదిలీ చేశారని ఆరోపణలున్నాయి. దీనిపై కొత్త యాజమాన్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నోటీసులు జారీచేశారు. అప్పటి నుంచి శివాజీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాదాపు 2నెలలపాటు ఆయన పోలీసులకు అందుబాటులో లేకుండా పోయారు..తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో శివాజీ ఇప్పటికే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు అలంద మీడియా షేర్ల బదిలీపైనే శివాజీని పోలీసులు విచారించనున్నారు.

Next Story

RELATED STORIES