ప్రతి క్రాఫ్ట్ ఓ అద్భుతం.. యంగ్ డైరెక్టర్లు మెచ్చిన 'దొరసాని'

ప్రతి క్రాఫ్ట్ ఓ అద్భుతం.. యంగ్ డైరెక్టర్లు మెచ్చిన దొరసాని
X

తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన దొరసాని సినిమాకు మంచి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా పలువురు యువ దర్శకులు ఈ సినిమా స్పెషల్ షోని వీక్షించారు. దొరసాని కథ ట్రూ అండ్ పర్ఫెక్ట్ లవ్ స్టోరీ గా ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటుందంటూ సినిమాపై ప్రశంసలు కురించారు. ఈ సినిమా చూసిన పలువురు దర్శకుల స్పందన.."సినిమా చూస్తున్నంత సేపు స్టోరీ లోనే ఉన్నా..నేను ఎంజాయ్ చేసాను" అంటూ సందీప్ రెడ్డి వంగ తెలిపారు. సినిమాను చూసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు " ప్రతి ఒక్కరూ చూడాల్సిన అందమైన ప్రేమ కథ" అంటూ దర్శకున్ని మెచ్చుకున్నారు. "ప్రతి క్రాఫ్ట్ కూడా అద్భుతం గా పనిచేసింది. 2019 కి బెస్ట్ లవ్ స్టొరీ" అంటూ యువ దర్శకుడు వేణు ఉడుగుల (నీది నాది ఒకటే కథ డైరెక్టర్) సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా పరిచయమవుతోన్న చిత్రం 'దొరసాని'. ఈ సినిమా ద్వారా కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.

Next Story

RELATED STORIES