తాజా వార్తలు

వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణి పురిటి నొప్పులతో ఆటోలోనే..

వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణి పురిటి నొప్పులతో ఆటోలోనే..
X

హైదరాబాద్‌లోని మలక్‌పేట ఏరియా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం పురిటిబిడ్డ ప్రాణం తీసింది. నొప్పులతో ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి వైద్యం అందించకుండా గంటలతరబడి బయటే ఉంచేయడంతో చివరికి ఆమె ఆటోలో ప్రసవించింది. మగబిడ్డ పుట్టాడు. ఐతే.. శిశువుకు సకాలంలో వైద్యం అందకపోవడంతో ప్రాణాలు నిలబడలేదు. తల్లిపరిస్థితి కూడా విషమంగా ఉంది. విషయం తెలిసిన బంధువులంతా ఆస్పత్రికి వచ్చి ఆందోళనకు దిగడంతో.. అప్పుడు వైద్యులు తల్లిని చికిత్స కోసం లోపలికి తీసుకెళ్లారు. కేవలం డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా భద్రతా చర్యలు చేపట్టారు.

Next Story

RELATED STORIES