డ్రైవర్ నిద్రమత్తులో.. 9 మంది ప్రాణాలు గాల్లో..

తమిళనాడులోని విల్లుపురం జిల్లా కల్లకుర్చి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బససు, వ్యాన్ ఢీకొన్న ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణీకులతో కోయంబత్తూరు నుంచి బస్సు చెన్నై వెళ్తోంది. అదే సమయంలో 14 మంది కార్మికులతో మినీ వ్యాన్ ఉతిరమెరూర్ నుంచి కంగెయాం వైపు వస్తోంది. వ్యాన్ అదుపుతప్పడంతో అన్నానగర్ ఫ్లైఓవర్ వద్ద ఎదురుగా వస్తున్న బస్‌ను ఢీకొట్టింది. ప్రమాదస్థలంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో జార్ఖండ్‌కు చెందిన ఏడుగురు కార్మికులు, రెండు వాహనాలకు చెందిన ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. బస్ డ్రైవర్ అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. గాయపడ్డవారిని కల్లకుర్చి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Next Story

RELATED STORIES