భర్తలను కాపాడేందుకు నదిలోకి దూకిన భార్యలు.. చివరకు..

భర్తలను కాపాడేందుకు నదిలోకి దూకిన భార్యలు.. చివరకు..
X

చత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో ఉన్న బానచ్చా జలపాతం సమీపంలో సోమవారం ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ తాహీర్, పర్వీన్ భార్యాభర్తలు. ఇద్దరూ కలిసి అత్తారిల్లు కొరియాకు వచ్చారు. అక్కాబావలను జలపాతం చూడ్డానికి తీసుకెళతానన్నాడు పర్వీన్ సోదరుడు నియాజ్. అతడి భార్య సనాకూడా బయలు దేరింది. నలుగురు కలిసి జలపాతం దగ్గరకు వెళ్లి చూస్తున్నారు. పై నించి జాలువారుతున్న నీటి అందాలను ఆస్వాదిస్తున్నారు నలుగురు. ఇంతలో బావ మరుదులు తాహిర్, నియాజ్‌లు కాలు జారి నీళ్లలో పడిపోయారు. కళ్లముందు ఇద్దరు నీళ్లలో పడి కొట్టుకుపోతుండడంతో సహాయం కోసం అరిచి వారి భార్యలైన పర్వీన్, సనాలు కూడా వారిని కాపాడాలని మరో ఆలోచన లేకుండా నీళ్లలో దూకేశారు. చూస్తుండగానే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి నలుగురు మృతి చెందడంతో ఆ ఇంట తీరని విషాదం నెలకొంది.

Next Story

RELATED STORIES