కాపు రిజర్వేషన్లపై విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు నెహ్రూ కౌంటర్

X
TV5 Telugu29 July 2019 3:26 PM GMT
కాపు రిజర్వేషన్ల విషయంలో తనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నించే నైతిక విలువ మీకు లేదంటూ విజయసాయిరెడ్డికి ధీటుగా సమాధానం చెప్పారు. కేసులతో కోర్టుల చుట్టు తిరుగుతున్నఏ-2 ముద్దాయిగా మీరున్నారని మండిపడ్డారు. తన సామాజిక వర్గానికి నష్టం కలిగే విధంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని.. అందుకే తాను స్పందించానన్నారు జ్యోతుల నెహ్రు. ఒకరి ప్రేరణతో నిర్ణయాన్ని వెలిబుచ్చే వ్యక్తిత్వం తనది కాదన్నారు. మనుషులు విలువలు కొలమానం చేయడం చేతగాని వ్యక్తి అని అర్థమయ్యిందని విమర్శించారు జ్యోతుల.
Next Story